శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 29 ఆగస్టు 2017 (18:45 IST)

అయిరాతో కోహ్లీ డ్యాన్స్ అదుర్స్.. వీడియో చూడండి..

శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా జట్టు ఇప్పటికే మాంచి జోష్ మీదుంది. ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా లంకపై మూడో వన్డే గెలిచి.. సంబరాలు చేసుకుంటున్నాడు. తాజాగా లంకపై గెలవడం

శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా జట్టు ఇప్పటికే మాంచి జోష్ మీదుంది. ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా లంకపై మూడో వన్డే గెలిచి.. సంబరాలు చేసుకుంటున్నాడు. తాజాగా లంకపై గెలవడంతో పండగ చేసుకుంటున్న టీమిండియా జట్టులో సభ్యుడైన షమీ ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఇందులో ష‌మీ రెండేళ్ల కూతురు అయిరాతో విరాట్ కోహ్లీ డ్యాన్స్ చేస్తున్నాడు. 
 
తాము సాధించిన విజయానికి తన కూతురు ఇలా సంబరపడిపోతుందని.. దీన్ని చూస్తే ఎంతో ఆనందంగా వుందని షమీ అన్నాడు. :"ఐ గాట్ ఏ గ‌ర్ల్" అనే పాట‌కు అయిరా కాళ్లు, చేతుల‌ను క‌దిలిస్తూ చుట్టూ తిరుగుతూ వేస్తోన్న డ్యాన్స్‌ని విరాట్ కోహ్లీ అనుక‌రించాడు.

అలా అయిరా, కోహ్లీ డ్యాన్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. బుల్లి డ్యాన్సర్‌తో కోహ్లీ డ్యాన్స్ అదిరిందని.. అయిరా డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అయిపోయినట్లు కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటిదాకా ఈ వీడియోను 9వేల మంది లైక్ చేశారు. వీరిద్దరి డ్యాన్స్‌ను మీరూ చూసి ఎంజాయ్ చేయండి.