శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 28 ఆగస్టు 2017 (16:56 IST)

ఆమె కూడా నాతో పాటు జైలులోనే వుండాలి: గుర్మీత్ రామ్ రహీమ్

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు అత్యాచార కేసులో పదేళ్ల జైలు శిక్ష ఖరారైన నేపథ్యంలో ఆయన కుమార్తె హనీప్రీత్ ఇన్సాన్‌ తాను తండ్రితో పాటు జైలులోనే ఉంచాలని క

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు అత్యాచార కేసులో పదేళ్ల జైలు శిక్ష ఖరారైన నేపథ్యంలో ఆయన కుమార్తె హనీప్రీత్ ఇన్సాన్‌ తాను తండ్రితో పాటు జైలులోనే ఉంచాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టు ఇందుకు అంగీకరించలేదు. ఈ విషయంలో ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని కోర్టు జోక్యం చేసుబోదని స్పష్టం చేసింది. 
 
గుర్మీత్ నడుము నొప్పి, మైగ్రేన్ సమస్యలతో బాధపడుతున్నారని, ఆయనకు తరుచూ ఆక్యూప్రెజర్ చేస్తుండాలని హనీప్రీత్ సింగ్ కోర్టుకు తెలిపింది. ఇందుకే గుర్మీత్‌తో ఆమె వుండాలని కోర్టును కోరినట్లు తెలుస్తోంది. 
 
కాగా హనీప్రీత్‌ను గుర్మీత్ 2009లో దత్తత తీసుకున్నారు. ఆమె అసలు పేరు ప్రియాంక తనేజా. యుపిలోని ఫతేపూర్ ఆమె స్వస్థలం. అత్తింటి వారు కట్నం కోసం వేధిస్తున్నారని హనీప్రీత్ గుర్మీత్‌ను ఆశ్రయించింది. దీంతో ఆమెను గుర్మీత్ దత్తతకు తీసుకున్నారు. ఆయన నటించిన పలు సినిమాల్లో హనీప్రీత్‌కు నటిగా అవకాశం కూడా కల్పించారు.