సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 ఏప్రియల్ 2024 (22:10 IST)

విరాట్ కోహ్లీకి జరిమానా.. మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత

virat kohli
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ జరిమానాకు గురయ్యాడు. నోబాల్.. నాటౌట్ అంటూ కోహ్లీ వాదించాడు. కోహ్లీ ప్రవర్తనను ఐపీఎల్ పాలకమండలి తీవ్రంగా పరిగణించింది. కోహ్లీ మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానాగా విధించింది.
 
ఐపీఎల్ నియమావళిలోని ఆర్టికల్ 2.8 ప్రకారం కోహ్లీ లెవల్-1 తప్పిదానికి పాల్పడినట్టు పాలకమండలి గుర్తించింది. తాను నిబంధనలు అతిక్రమించినట్టు కోహ్లీ అంగీకరించడంతో మ్యాచ్ రిఫరీ జరిమానాతో సరిపెట్టారు.
 
బెంగళూరు జట్టు బ్యాటింగ్ చేస్తున్న సందర్భంగా కోహ్లీ ఓ ఫుల్ టాస్ బాల్‌కు అవుటయ్యాడు. అది నోబాల్ అవుతుందని, తాను నాటౌట్ అంటూ కోహ్లీ వాదించాడు.