డుప్లెసిస్ బాటలో విరాట్ కోహ్లీ.. బాల్ టాంపరింగ్‌కు పాల్పడ్డాడా? ఐసీసీ ఏం చేస్తుందో?
దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్ డుప్లెసిస్ బాల్ టాంపరింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో ఐసీసీ మ్యాచ్‌లో వందశాతం కోత విధించిన నేపథ్యంలో.. టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా బాల్ టాంపరింగ్ ఆరోపణలు ఎదు
దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్ డుప్లెసిస్ బాల్ టాంపరింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో ఐసీసీ మ్యాచ్‌లో వందశాతం కోత విధించిన నేపథ్యంలో.. టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా బాల్ టాంపరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నవంబరు 9 నుంచి 13 వరకు రాజ్‌కోట్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు జరిగిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ బాల్ టాంపరింగ్‌కు పాల్పడినట్లు డైలీ మెయిల్ ఓ కథనంలో పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియో ఆధారాలు ఉన్నాయని డైలీ మెయిల్ వెల్లడించింది. నోట్లో ఉన్న ఓ స్వీటు పదార్థం ద్వారా కోహ్లీ బంతి మెరుపును పోగొట్టేందుకు ప్రయత్నించాడంటూ ఆ పత్రిక ఆరోపిస్తూ కథనాన్ని ప్రచురించింది.
నోట్లో స్వీటు పదార్థం ఉన్నప్పుడు కోహ్లీ తన కుడి చేతిని పలుమార్లు నోట్లో పెట్టి... దాన్ని బంతికి రుద్దడంతో బంతి మెరుపు కోల్పోయిందని పేర్కొంది. దీనిపై ఇంగ్లండ్ ఆటగాళ్లు గాని, అంపైర్లు గాని ఎలాంటి ఫిర్యాదు చేయలేదని డైలీ మెయిల్ వెల్లడించింది.