ట్విట్టర్లో సెహ్వాగ్ యాక్టివ్.. ఇంగ్లండ్ జర్నలిస్ట్‌ను ఏకిపారేశాడు.. ఒక్క వరల్డ్ కప్ కూడా గెలుచుకోలేదే?
రియో జరిగిన ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ పోటీల్లో భారత క్రీడాకారులు పసిడి గెలుచుకోలేదన్న విషయం తెలిసింది. అయితే బ్యాడ్మింటన్ విభాగంలో మాత్రం భారత్‌కు రజత పతకం లభించింది. రియోలో స్వర్ణ పతకం సాధించకపోవడంతో
రియో జరిగిన ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ పోటీల్లో భారత క్రీడాకారులు పసిడి గెలుచుకోలేదన్న విషయం తెలిసింది. అయితే బ్యాడ్మింటన్ విభాగంలో మాత్రం భారత్‌కు రజత పతకం లభించింది. రియోలో స్వర్ణ పతకం సాధించకపోవడంతో పాటు వెండి పతకం సాధించిన హైదరాబాదీ పీవీ సింధుపై ప్రశంసలు గుప్పించడంపై ఇంగ్లండ్ జర్నలిస్ట్ మోర్గాన్ ట్విట్టర్లో విమర్శలు గుప్పించాడు.
ఈ విమర్శలకు ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉన్న భారత డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ధీటుగా సమాధానమిచ్చాడు. తాము చిన్న చిన్న సంతోషాలకే పండగ చేసుకుంటాం. కానీ క్రికెట్‌ను కనుగొన్న ఇంగ్లండ్ ఇప్పటి వరకు ఓ వరల్డ్ కప్ కూడా గెలుచుకోలేదు.. ఎందుకని అంటూ ప్రశ్నించాడు. సెహ్వాగ్ ప్రశ్నకు ఆ జర్నలిస్టుకు దిమ్మతిరిగింది.
ఇందుకు బదులిచ్చిన ఇంగ్లండ్ జర్నలిస్ట్.. వచ్చేసారి ప్రపంచ కప్ గెలుస్తాం.. అంతలోపు ఒలింపిక్స్‌లో మీరు పసిడి సాధించడం అంటూ సమాధానమిచ్చారు. దీనికీ సెహ్వాగ్ ధీటుగా సమాధానమిచ్చాడు. ఇప్పటికే ఒలింపిక్స్‌లో తాము పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నామన్నాడు. మీరే ఇంకా ప్రపంచ కప్ గెలుచుకోలేదని.. ముందు వరల్డ్ కప్ సాధించే పనుల్లో పడితే బాగుంటుందని కామెంట్ చేశాడు.
ఈ నేపథ్యంలో రియో పారాఒలింపిక్స్ పోటీల్లో తమిళనాడుకు చెందిన మారియప్పన్ తంగవేలు హైజంప్‌లో స్వర్ణం సాధించాడు. ఇతనికి సెహ్వాగ్ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపాడు. అలాగే ఇంగ్లండ్ జర్నలిస్ట్ మోర్గాన్ కూడా తంగవేలుకు శుభాకాంక్షలు తెలిపాడు.