షమీతో కాపురం చేయలేను.. నెలకు రూ.10 లక్షలు భరణం చెల్లించాలి... జహాన్
భారత క్రికెట్ జట్టు క్రికెటర్ మహ్మద్ షమీకి ఆయన భార్య నుంచి మొదలైన సమస్య ఇప్పట్లో పరిష్కారమయ్యేలా కనిపించడం లేదు. షమీతో కలిసి జీవించేందుకు ససేమిరా అంటున్న హాసిన్ జహాన్ ఇపుడు నెలకు ఏకంగా రూ.10 లక్షల చొప
భారత క్రికెట్ జట్టు క్రికెటర్ మహ్మద్ షమీకి ఆయన భార్య నుంచి మొదలైన సమస్య ఇప్పట్లో పరిష్కారమయ్యేలా కనిపించడం లేదు. షమీతో కలిసి జీవించేందుకు ససేమిరా అంటున్న హాసిన్ జహాన్ ఇపుడు నెలకు ఏకంగా రూ.10 లక్షల చొప్పున భరణం డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
వెస్ట్ బెంగాల్‌లోని అలిపోర్ జ్యుడీషియల్ మేజిస్ట్రట్ కోర్టులో షమీకి వ్యతిరేకంగా హసిన్ గృహ హింస నిరోధక చట్టం కింద దాఖలు చేసిన పిటిషన్ విచారణలో ఉంది. ఇదే కోర్టులో ఆమె తాజాగా భరణం కోరుతూ మరో పిటిషన్ వేశారు. షమీకి వ్యతిరేకంగా న్యాయ పోరాటం మొదలు పెట్టిన తర్వాత అతడు భార్యకు రూపాయి కూడా ఇవ్వకపోవడంతో ఖర్చులకు ఇబ్బంది పడుతున్నట్టు ఆమె తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
ప్రతియేటా రూ.100 కోట్లు సంపాదిస్తున్న షమీ నెలకు రూ.10 లక్షలు ఇవ్వడం భారం కాబోదన్నారు. కుటుంబ పోషణ చూసుకోవాల్సిన బాధ్యత అతడిపై ఉందని కనుక హసిన్‌కు రూ.7 లక్షలు, కుమార్తెకు రూ.3 లక్షల చొప్పున ప్రతీ నెలా ఇప్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు.
దీనిపై ఆమె స్పందిస్తూ, 'నేను అన్ని విధాలుగా నష్టపోయాను. ఢిల్లీకి వచ్చి షమీ కోసం ఏడు రోజులు వేచి చూశా. కానీ, అతడు నా పట్ల ప్రవర్తించిన విధానాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. తను నా కుమార్తెను ఒక్కసారే కలిశాడు. అతడు ఎటువంటి బాధ్యతలు తీసుకోనేందుకు సుముఖంగా లేనందున నాకు మెయింటెనెన్స్ ఇప్పించాలి' అని ఆమె ప్రాధేయపడింది.