శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (09:13 IST)

భార్య హసీన్‌కు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన షమీ: అంత సీన్ లేదన్న?

క్రికెటర్ మహ్మద్ షమీ తన భార్యకు నాలుగవ పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపాడు. సోషల్ మీడియా వేదికగా షమీ భార్య హసీన్ జహాన్ పోస్టులు పెడుతూ.. తన భర్తకు పలువురు మహిళలతో సంబంధాలున్నాయని.. ఫిక్సింగ్‌కు పాల్పడ్డా

క్రికెటర్ మహ్మద్ షమీ తన భార్యకు నాలుగవ పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపాడు. సోషల్ మీడియా వేదికగా షమీ భార్య హసీన్ జహాన్ పోస్టులు పెడుతూ.. తన భర్తకు పలువురు మహిళలతో సంబంధాలున్నాయని.. ఫిక్సింగ్‌కు పాల్పడ్డానని ఆరోపించింది. ఇంకా తనను హింసించాడని.. తమ్ముడితో రేప్ చేయించాలని చూశాడని సంచలన ఆరోపణలు చేసింది. 
 
ఇన్ని చేసినా.. షమీ తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులో ఆమెను ఇప్పటికీ ప్రేమిస్తున్నాననే సంకేతాలు పంపాడు. ఓ పెద్ద కేక్ బొమ్మను పోస్టు చేస్తూ, తన బెబోకు నాలుగో వివాహ వార్షికోత్సవ కేక్.. మిస్ యూ అంటూ మెసేజ్ పెట్టాడు. 
 
అయితే ఈ పోస్టుపై నెటిజన్లు మండిపడుతున్నారు. షమీ నుంచి అభినందనలు అందుకోవాల్సిన గొప్ప వ్యక్తిత్వం హసీన్‌కు లేదని అభిమానులు పోస్టులు పెడుతున్నారు. హసీన్‌‍కు అంత సీను లేదని, విషెస్ చెప్పాల్సినంత గొప్ప వ్యక్తిత్వం ఆమెది కాదని ట్రాల్ చేస్తున్నారు.