గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 26 మే 2019 (16:59 IST)

భార్యలు పిల్లలు సరే.. మరి ప్రియురాళ్ళ పరిస్థితి ఏంటి?

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌ టోర్నీకి ఇంగ్లండ్ అండ్ వేల్స్ ఆతిథ్యమివ్వనుంది. ఈ నెల 30వ తేదీ నుంచి ఈ టోర్నీ ప్రారంభంకానుంది. ఇందుకోసం టోర్నీలో పాల్గొనే వివిధ దేశాలకు చెందిన క్రికెట్ జట్లన్నీ ఇప్పటికే ఇంగ్లండ్‌కు చేరుకున్నాయి. 
 
అయితే, ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత క్రికెటర్లు తమ భార్యాపిల్లలతో గడపవచ్చని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అనుమతి ఇచ్చింది. ప్రపంచ కప్‌కు తమ ఫ్యామిలీని పంపించాలని పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ గత నెలలో విజ్ఞప్తి చేశారు. దీన్ని పీసీబీ తిరస్కరించింది. 
 
కానీ, పాకిస్థాన్ క్రికెటర్లు కూడా భార్యాపిల్లలు తమ వెంట ఉండేందుకు అనుమతించాలని మరోమారు బోర్డుకు విజ్ఞప్తి చేశారు. వీరి వినతిని పరిశీలించిన బోర్డు... మ్యాచ్‌ ముగిసిన తర్వాత భార్యాపిల్లలతో క్రికెటర్లు ఉండేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో పాకిస్థాన్ క్రికెటర్లు తమ భార్యాపిల్లలను ఇంగ్లండ్‌కు పిలిపించుకునే పనిలో నిమగ్నమయ్యారు. 
 
పీసీబీ నిర్ణయం పట్ల వివాహిత క్రికెటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, బ్యాచిలర్ క్రికెటర్లు కూడా తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. తాము కూడా తమ ప్రియురాళ్లను వెంట తీసుకొచ్చుకునేందుకు అనుమతి ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 
 
కాగా, వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా పాకిస్థాన్ - భారత్ క్రికెట్ జట్ల మధ్య మే 16వ తేదీన మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం టిక్కెట్లు హాట్ కేకుల్లా ఇప్పటికే అమ్ముడు పోయిన విషయం తెల్సిందే.