సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : గురువారం, 23 మే 2019 (17:37 IST)

కోహ్లీ డ్యాన్సింగ్ స్టెప్పులు.. డివిలియర్స్, శ్రేయాస్‌లను నామినేట్ చేశాడు..

డ్రస్సేమో ఫార్మల్, ఆయనేమో టీమిండియాకు కెప్టెన్. అయినా మిక్కీ సింగ్ యార్రి యా అనే పాటకు స్టెప్పులేశాడు. ఈ స్టెప్పులు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. టీమిండియా కెప్టెన్ కోహ్లీ డ్యాన్స్ మూమెంట్లు అదుర్స్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 
 
వరల్డ్ కప్ కోసం ఇప్పటికే ఇంగ్లండ్ చేరుకున్న కోహ్లీ సేన వార్మప్ మ్యాచ్‌లకు సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా కోహ్లీ డ్యాన్సింగ్ ఛాలెంజ్ స్వీకరించాడు. పంజాబీ పాటకు స్టెప్పులేశాడు. అంతేకాకుండా.. #BFFChallengeను ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రారంభించాడు. మిక్కీ సింగ్ హిట్ సాంగ్ యార్రి పాటకు స్టెప్పులేశాడు. ఇంకా #BFFChallengeకు ఏబీ డివిలియర్స్, శ్రేయాస్ అయ్యర్‌లను నామినేట్ చేశాడు. 
 
ఇంకేముంది.. కోహ్లీ డ్యాన్సింగ్ స్కిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పలు కార్యక్రమాల్లో డ్యాన్సులు చేయడం, పాటలు పాడటం కోహ్లీకి బాగా అలవాటే. ఇక తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీ వేసిన స్టెప్పులకు సంబంధించిన వీడియో.. ఒక్క రోజులోనే 3.8 మిలియన్ల వ్యూస్‌ను కొల్లగొట్టింది. కాగా జూన్ ఐదో తేదీ నుంచి ప్రపంచ కప్ మెగా టోర్నీ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.