సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : బుధవారం, 22 మే 2019 (11:36 IST)

వరల్డ్ కప్‌ మ్యాచ్‌లను ఎంజాయ్ చేస్తూ రాణిస్తే కప్ మనదే : కోహ్లీ

ఈ నెల 30వ తేదీ నుంచి ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. ఇంగ్లండ్ అండ్ వేల్స్ ఆతిథ్యమిస్తోంది. ఇందుకోసం 15 మంది సభ్యులతో కూడిన భారత క్రికెట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. 
 
అయితే, ఈ మెగా ఈవెంట్‌లో భారత జట్టు రాణింపుపై భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందిస్తూ. ఐసీసీ వరల్డ్ కప్‌లో మెరుగ్గా రాణిస్తామనే నమ్మకముందన్నాడు. అదేసమయంలో స్వదేశంలో విరామం లేకుండా రెండు నెలల పాటు సాగిన ఐపీఎల్ టోర్నీలో పాల్గొనడం వల్ల ఆటగాళ్లు అలసిపోయారన్న వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. తామంతా ఫిట్నెస్‌ పరంగా ఎంతో బలంగా ఉన్నట్టు చెప్పారు. ఇంగ్లండ్ పిచ్‌లపై పరుగుల వరద పారే అవకాశం ఉందని, అందువల్ల బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేస్తూ రాణిస్తే తప్పకుండా కప్ మనదేనని కోహ్లీ ధీమా వ్యక్తం చేశాడు. 
 
ఇకపోతే, జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి స్పందిస్తూ, అటు వరల్డ్ కప్ సాధించే అవకాశాలు భారత్‌కు మెరుగ్గా ఉన్నాయని చెప్పుకొచ్చాడు. వరల్డ్‌కప్‌ లాంటి వేదికల్లో ఎంజాయ్‌ చేస్తూ క్రికెట్‌ ఆడాలి. మా సామ‌ర్థ్యం మేరకు రాణిస్తే కప్పు మన సొంతమవుతుంది. ఈ టోర్నీలో గట్టిపోటీ ఉంటుంది. 2015 కంటే బంగ్లాదేశ్‌, అఫ్గనిస్థాన్‌ జట్లు చాలా బలమైన జట్లుగా అవతరించాయని చెప్పారు.