శుక్రవారం, 22 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 21 మే 2019 (14:02 IST)

ఐసీసీ వరల్డ్ కప్ 2019 : భారత్ షెడ్యూల్ ఇదే... హైఓల్టేజ్ మ్యాచ్ ఎపుడంటే..

ఈ నెల 30వ తేదీ నుంచి ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభంకానుంది. ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా జరిగే ఈ మెగా ఈవెంట్‌లో భారత జట్టు తన తొలి మ్యాచ్‌ను జూన్ 5వ తేదీన ఆడనుంది. సౌతాంఫ్టన్ వేదికగా జరిగే మ్యాచ్‌లో బలమైన ప్రత్యర్థి సౌతాఫ్రికాతో తలపడనుంది. 
 
ఆ తర్వాత జూన్ 9వ తేదీన లండన్‌లోని ది ఓవల్ మైదానంలో ఆస్ట్రేలియాతోనూ, జూన్ 13వ తేదీన నాటింగ్‌హామ్ వేదికగా ట్రెంట్‌బ్రిడ్జి మైదానంలో న్యూజిలాండ్ జట్టుతో, జూన్ 16వ తేదీన మాంచెష్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో పాకిస్థాన్ జట్టుతో తలపడుతుంది. 
 
అలాగే, జూన్ 22వ తేదీన సౌతాంఫ్టన్‌లో ఆప్ఘనిస్థాన్‌తోనూ, జూన్ 27వ తేదీన మాంచెష్టర్‌లో వెస్టిండీస్‌తో, జూన్ 30వ తేదీన బర్మింగ్‌హ్యామ్ వేదికగా ఇంగ్లండ్‌ జట్టుతో, జూలై 2వ తేదీన బర్మింగ్‌హ్యామ్‌లో బంగ్లాదేశ్‌ జట్టుతో, జూలై 6వ తేదీన లీడ్స్‌లో శ్రీలంక జట్టుతో ఆడనుంది. భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 3 గంటలకు ప్రారంభంకానున్నాయి. 
 
కాగా, రెండుసార్లు ప్రపంచ విజేతగా నిలిచిన భారత్ జట్టు తన తొలి మ్యాచ్‌ను జూన్ 5వ తేదీన సౌతాఫ్రికాతో ప్రారంభించి, తన చివరి మ్యాచ్‌ను జూలై 6వ తేదీన శ్రీలంకతో ముగిస్తుంది. హైఓల్టేజ్ మ్యాచ్‌గా పరిగణించే భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ జూన్ 16వ తేదీన జరుగుతుంది.