గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 19 మే 2019 (14:59 IST)

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఆస్ట్రేలియాదే : గౌతం గంభీర్

ఈ నెల 30వ తేదీ నుంచి ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ పోటీలు ప్రారంభంకానున్నాయి. ఈ పోటీల్లో క్రికెట్ ఆడే దేశాలన్నీ పాల్గొంటున్నాయి. అయితే, ఈ దఫా విజేతగా ఆస్ట్రేలియానే విజేతగా పేర్కొంటున్నారు. నిన్నటికి నిన్న భారత క్రికెట్ మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే కూడా ఆస్ట్రేలియానే విజేతగా ప్రకటించారు. ఇపుడు గౌతం గంభీర్ కూడా ఆస్ట్రేలియాకో ఓటు వేశారు. 
 
ఇదే అంశంపై గౌతం గంభీర్ స్పందిస్తూ, ఈ సారి వరల్డ్ కప్ కొట్టేది మాత్రం ఆస్ట్రేలియా అని జోస్యం చెప్పారు. ఆసీస్ జట్టు అన్ని విభాగాల్లో బలంగా ఉందన్నారు. ఇంగ్లండ్‌కు మాత్రం స్వదేశీ పిచ్‌లపై ఆడటమే అనుకూల అంశంగా ఉందన్నారు. ఇంగ్లండ్ జట్టు గతంతో పోలిస్తే బౌలింగ్, బ్యాటింగ్ విభాగంలో బలంగా ఉందన్నారు. ఇంగ్లండ్‌కు అదనపు బలం మాత్రం ఆల్‌రౌండర్లు అని చెప్పుకొచ్చాడు. ఫైనల్‌లో ఆసీస్‌తో టీమిండియా లేదా ఇంగ్లాండ్ ఆడుతుందన్నారు. 
 
వరల్డ్ కప్ గెలువాలంటే ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం ముఖ్యమన్నారు. ఈ వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తారని గౌతమ్ తెలిపారు. భారత జట్టుకు బుమ్రా ఎక్స్ ఫ్యాక్టర్‌లా కనిపిస్తున్నాడని చెప్పుకొచ్చారు. 2011 ప్రపంచ కప్ ఫైనల్‌లో గంభీర్ శ్రీలంకపై 97 పరుగులు చేసి ప్రపంచ కప్ రావడంలో కీలక వ్యక్తిగా మారాడు. కాగా, ఈ వరల్డ్ కప్‌లో టైటిల్ ఫేవరేట్‌ జట్లుగా భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ జట్లను పేర్కొన్నారు.