శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : శనివారం, 18 మే 2019 (12:32 IST)

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ హిస్టరీ : 1975 నుంచి 2015... విజేత - రన్నరప్

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీ ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. ఈ టోర్నీకి ఇంగ్లండ్ అండ్ వేల్స్ ఆతిథ్యమివ్వనుంది. ఈ టోర్నీ కోసం క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, గత 1975 నుంచి 2015 వరకు జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీల్లో టైటిల్‌ విజేత, రన్నరప్, ఆతిథ్యమిచ్చిన దేశం, ఫైనల్ మ్యాచ్ జరిగిన తేదీ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
 
* 1975లో జరిగిన వరల్డ్ కప్‌కు ఇంగ్లండ్ ఆతిథ్యమివ్వగా విజేతగా వెస్టిండీస్ జట్టు అవతరించింది. ఆస్ట్రేలియా రన్నరప్‌గా నిలిచింది. 
 
* 1979లో జరిగిన ప్రపంచ కప్ టోర్నీలో వెస్టిండీస్ జట్టు వరుసగా రెండోసారి విజేతగా నిలిచింది. ఈ టోర్నీకి కూడా ఇంగ్లండ్ ఆతిథ్యమిచ్చింది. ఈ యేడాది ఇంగ్లండ్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. 
 
* 1983లో ఇంగ్లండ్ వేదికగా జరిగిన వరల్డ్ టోర్నీలో కపిల్ దేవ్ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు అనూహ్యంగా టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో బలమైన వెస్టిండీస్ జట్టు చిత్తు చేసి ప్రపంచ విజేతగా నిలించింది. దీంతో వెస్టిండీస్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. 
 
* 1987లో జరిగిన భారత్, పాకిస్థాన్ దేశాలు సంయుక్తంగా ఈ టోర్నీకి ఆతిథ్యమిచ్చాయి. ఇందులో ఛాపింయన్‌గా ఆస్ట్రేలియా నిలిస్తే రన్నరప్‌గా ఇంగ్లండ్ నిలిచింది. ఈ టోర్నీ అక్టోబరు 08 నుంచి నవంబరు 8వ తేదీ వరకు జరిగింది. 
 
* 1992లో న్యూజిలాండ్ - ఆస్ట్రేలియా దేశాలు సంయుక్తంగా వరల్డ్ కప్ టోర్నీని నిర్వహించాయి. ఈ దఫా ఇంగ్లండ్‌ను చిత్తుచేసిన ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్థాన్ జట్టు విజయభేరీ మోగించింది. 
 
* 1996లో జరిగిన ప్రపంచ కప్‌ను ఇంగల్ండ్, వేల్స్, ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్ దేశాలు సంయుక్తంగా నిర్వహించాయి. ఈ దఫా పాకిస్థాన్ జట్టును కెప్టెన్ స్టీవ్ వా సారథ్యంలోని ఆస్ట్రేలియా జట్టు చిత్తుగా ఓడించి టైటిల్ ఎగురేసుకుపోయింది. 
 
* 2003లో జరిగిన ఐసీసీ ప్రపంచ కప్ పోటీలను సౌతాఫ్రికా, జింబాబ్వే, కెన్యా దేశాలు నిర్వహించాయి. ఈ పోటీల్లో భారత్, ఆస్ట్రేలియాలు ఫైనల్‌లో తలపడ్డాయి. ఇందులో రికీ పాంటింగ్ సారథ్యంలోని ఆస్ట్రేలియా జట్టు భారత్‌ను ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. 
 
* 2007లో జరిగిన వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా జట్టు వరుసగా మూడోసారి టైటిల్‌ను ఒడిసిపట్టుకుంది. వెస్టిండీస్ ఆతిథ్యమివ్వగా, శ్రీలంక - ఆస్ట్రేలియాలు తలపడ్డాయి. ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. 
 
* 2011లో ముంబై వేదికగా ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మెగా ఈవెంట్‌కు భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాలు ఆతిథ్యమివ్వగా, ఫైనల్ మ్యాచ్‌లో భారత్, శ్రీలంక జట్లు తలపడ్డాయి. చివరి బంతివరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని టీమిండియా టైటిల్ విజేతగాను, శ్రీలంక రన్నరప్‌గా నిలిచింది. 
 
* గత 2015లో జరిగిన టోర్నీకి న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు ఆతిథ్యమివ్వగా, ఈ రెండు దేశాల్లో ఫైనల్‌లో తలపడ్డాయి. తొలి మ్యాచ్ నుంచి సెమీ ఫైనల్ మ్యాచ్ వరకు అద్భుతంగా ఆడిన న్యూజిలాండ్ జట్టు ఫైనల్‌లో ఒత్తిడికి లోనై టైటిల్‌ను ఆస్ట్రేలియాకు అప్పగించింది. ఫలితంగా ఆస్ట్రేలియా జట్టు ఇప్పటివరకు ఐదుసార్లు విశ్వవిజేతగా నిలువగా, భారత్ రెండుసార్లు, వెస్టిండీస్ రెండుసార్లు, శ్రీలంక, పాకస్థాన్ దేశాలు ఒక్కోసారి విశ్వవిజేతగా నిలిచాయి. క్రికెట్‌కు పుట్టినిల్లు అయిన ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, జింబాబ్వే జట్లు మాత్రం ఇప్పటివరకు ప్రపంచ కప్ టైటిల్‌ను అందుకోలేకపోయాయి.