శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 17 మే 2019 (16:52 IST)

ఐసీసీ వరల్డ్ కప్ : ప్రైజ్‌మనీ ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే

క్రికెట్ ప్రేమికులకు పసందైన విందు అందించేందుకు మరో మెగా సంబరం మొదలుకానుంది. ఐసీసీ వరల్డ్ కప్ పోటీలు ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ పోటీల కోసం ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికకానుంది. 
 
ఈ టోర్నీలో 10 అగ్రశ్రేణి జట్లు పాల్గొంటున్నాయి. ఫైనల్ మ్యాచ్ జూలై 14న లార్డ్స్ మైదానంలో జరగనుంది. టోర్నీలో ఈసారి అనుబంధ సభ్య దేశాల జట్లకు స్థానం కల్పించకపోవడం ఆశ్చర్యకరమైన నిర్ణయం. 
 
ఇక అసలు విషయానికొస్తే, ఈసారి టోర్నీలో విజేతకు అందించే ప్రైజ్‌మనీ గతంలో ఎన్నడూ ఇవ్వనంత స్థాయిలో ఉంది. విజేతకు రూ.28 కోట్లు నగదు బహుమతిగా అందిస్తారు. రన్నరప్‌గా నిలిచిన జట్టు సైతం రూ.14 కోట్లు అందుకోనుంది. సెమీఫైనల్‌తో సరిపెట్టుకున్న జట్లకు రూ.5.6 కోట్లు ఇవ్వనున్నారు. 
 
కాగా, ఈ మెగా ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించేందుకు బ్రిటన్ అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. కట్టుదిట్టమైన భద్రతను కల్పించింది. ఈ టోర్నీ కోసం భారత్ కూడా మెరికల్లాంటి క్రికెటర్లతో కూడా జట్టును ప్రకటించిన విషయం తెల్సిందే.