బుధవారం, 9 ఏప్రియల్ 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 27 మార్చి 2025 (16:37 IST)

యశస్వి యాదవ్ అరుదైన రికార్డు.. భారత నాలుగో క్రికెటర్‌గా...

YashasviJaiswal
రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు యశస్వి జైశ్వాల్ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ 18వ సీజన్ పోటీల్లో భాగంగా టీ20ల్లో అత్యంత వేగంగా 3 వేల పరుగులు చేసిన నాలుగో భారతీయ ఆటగాడిగా నిలిచాడు. 23 ఏళ్ల ఈ స్టార్ క్రికెటర్ కేవలం 102 ఇన్నింగ్స్‌లలో 3000 పరుగులు చేశాడు. 
 
ఈ జాబితాలో తెలుగు ఆటగాడు తిలక్ వర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. తిలక్ వర్మ కేవలం 90 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాత రుతురాజా గైక్వాడ్ (91), కేఎల్ రాహుల్ (93)లు ఉన్నారు. జైశ్వాల్ నాలుగో స్థానంలో ఉంటే గిల్ (103) ఐదో స్థానంలో ఉన్నాడు. 
 
కాగా, బుధవారం బరస్పరా క్రికెట్ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన మ్యాచ్‌లో జైశ్వాల్ 29 రన్స్ చేయడంతో ఈ మైలురాయిని చేరుకున్నాడు. అయితే, ఈ మ్యాచ్‌‍లో రాజస్థాన్ ఓటమిపాలైంది. కేకేఆర్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.