ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 19 జులై 2017 (10:53 IST)

అనారోగ్య జనాభా పెరగవచ్చు.. క్రీడలు ఆడకపోతే గోవిందా: సచిన్

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పెరుగుతున్న జనాభాపై ఆందోళన వ్యక్తం చేశారు. అదీ కూడా దేశంలో పెరుగుతున్న జనాభా కాస్త అనారోగ్యంతో బాధపడుతుందన్నారు. శారీరక వ్యాయామాలు లేకుండా, క్రీడల్లో పాల్గొనకుండా దే

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పెరుగుతున్న జనాభాపై ఆందోళన వ్యక్తం చేశారు. అదీ కూడా దేశంలో పెరుగుతున్న జనాభా కాస్త అనారోగ్యంతో బాధపడుతుందన్నారు. శారీరక వ్యాయామాలు లేకుండా, క్రీడల్లో పాల్గొనకుండా దేశంలో అనారోగ్య జనాభాను పెంచవద్దని యువతకు సూచించాడు.
 
పెరుగుతున్న జనాభా అనారోగ్యం నుంచి గట్టెక్కాలంటే.. క్రీడల్లో పాల్గొనాలన్నారు. అనారోగ్యాల కారణంగా 2020 వరకు మన దేశం చాలా చిన్నగా మారిపోవచ్చని అన్నాడు. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక క్రీడ ఆడుతూ ఉండాలని చెప్పాడు.
 
స్థూలకాయం విషయంలో మన దేశం ప్రపంచంలో మూడో స్థానంలో ఉందనే విషయాన్ని గుర్తు చేశాడు. ఆటలు లేకుండా తాను ఒక్క క్షణం కూడా ఉండలేనని... క్రీడలు తనకు ఆక్సిజన్ లాంటి వని సచిన్ చెప్పాడు. క్రీడలను చాలామంది  ప్రొఫెషనల్‌గా చూడటాన్ని మానేయాలని పిలుపునిచ్చారు.