బుధవారం, 25 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 27 జనవరి 2018 (12:53 IST)

బౌలింగ్ చేస్తూ కుప్పకూలి చనిపోయిన యువ బౌలర్

హైదరాబాద్ నగరానికి చెందిన ఓ యువ బౌలర్.. బౌలింగ్ చేస్తూ కుప్పకూలి కన్నుమూశాడు. ఈ విషాదకర సంఘటన ఈనెల 26వతేదీన హైదరాబాద్ నగరంలో జహీరానగర్ జరిగింది.

హైదరాబాద్ నగరానికి చెందిన ఓ యువ బౌలర్.. బౌలింగ్ చేస్తూ కుప్పకూలి కన్నుమూశాడు. ఈ విషాదకర సంఘటన ఈనెల 26వతేదీన హైదరాబాద్ నగరంలో జహీరానగర్ జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్, బంజారాహిల్స్ క్రికెట్ టోర్నమెంట్‌ను శుక్రవారం నిర్వహించారు. రాత్రి 11 గంటలకు అంతా హడావిడి. రెండు జట్లు మధ్య కేరింతలు, అరుపులతో గ్రౌండ్ హోరెత్తుతుంది. బౌలింగ్ చేస్తూ చేస్తూ.. లాయెడ్ ఆంటోనీ అనే యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. బౌలింగ్ చేస్తూ పడిపోయాడనీ అందరూ అనుకున్నారు. వెంటనే లేవలేదు. 
 
దీంతో కంగారు పడిన స్నేహితులు అతన్ని లేపినా లేవలేదు. మూర్ఛవచ్చి వుంటుందని అనుకుని వెంటనే ఆస్పత్రికి తరలించారు.  అక్కడ ఆంటోనీని వైద్యులు పరిశీలించి చనిపోయినట్టు ధృవీకరించారు. దీంతో సహచర క్రికెటర్లు, ఆటోనీ కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. కుప్పకూలిన విజువల్స్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.