శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (17:13 IST)

దిశా చావ్లాతో కలిసి ఏడడుగులు వేసిన జయంత్ యాదవ్

Jayant Yadav
టీమిండియా ఆల్‌రౌండర్ జయంత్ యాదవ్ ఓ ఇంటివాడయ్యాడు. దిశా చావ్లాతో కలిసి ఏడడుగులు నడిచాడు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు. బెటర్ టుగెదర్ అని అతడు కామెంట్ చేశాడు. 2019, నవంబర్ 22లోనే ఈ ఇద్దరి ఎంగేజ్‌మెంట్ జరిగింది. జయంత్ పెళ్లి ఫొటోలు షేర్ చేయగానే పలువురు క్రికెటర్లు అతనికి కంగ్రాట్స్ చెప్పారు. 
 
జయంత్‌ గతేడాది ముంబై ఇండియన్స్ టీమ్ తరఫున ఐపీఎల్ ఫైనల్లో ఆడాడు. 2016లో ఇంగ్లండ్ టీమ్‌తో మ్యాచ్‌లో జయంత్ టీమిండియా తరఫున టెస్ట్ అరంగేట్రం చేశాడు. అదే సిరీస్‌లో వైజాగ్‌లో జరిగిన మూడో టెస్ట్‌లో సెంచరీ కూడా చేయడం విశేషం. 31 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్ టెస్టుల్లో 46.5 సగటుతో 228 పరుగులు చేశాడు. ఇక అదే ఏడాది న్యూజిలాండ్‌తో వైజాగ్‌లో తన కెరీర్‌లోని ఏకైక వన్డేలో ఆడాడు.