బుధవారం, 8 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ప్రస్తుత సిరీస్
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 2 ఫిబ్రవరి 2017 (01:05 IST)

తిప్పేసిన చాహల్: సీరీస్ ఎగరేసుకుపోయిన భారత్

చరిత్ర సృష్టించడం అంటే ఇదీ అని నిరూపిస్తూ, విజయం ఇంత సులభమా అని సంకేతిస్తూ విరాట్ కోహ్లీ సేన ఇంగ్లండ్ కళ్లముందే సీరీస్‌ను ఎగరేసుకుపోయింది. టీ20 సీరీస్‌ను ఓటమితో ప్రారంభించిన టీమిండియా నిర్ణయాత్మక మూడో టీ20లో 75 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించ

చరిత్ర సృష్టించడం అంటే ఇదీ అని నిరూపిస్తూ, విజయం ఇంత సులభమా అని సంకేతిస్తూ విరాట్ కోహ్లీ సేన ఇంగ్లండ్ కళ్లముందే సీరీస్‌ను ఎగరేసుకుపోయింది. టీ20 సీరీస్‌ను ఓటమితో ప్రారంభించిన టీమిండియా నిర్ణయాత్మక మూడో టీ20లో 75 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. టెస్ట్, వన్డే సిరీస్‌లతో పాటు టీ20 సిరీస్‌ను కూడా భారత్ గెలుచుకుంది. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి అద్భుతమైన ముగింపుతో ఘన విజయం సాధించింది. 2-1తో సిరీస్‌ కైవసం చేసుకొంది.
 
తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జట్టు 4 పరుగుల వద్దే విరాట్‌కోహ్లీ (2) వికెట్‌ కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన సురేశ్‌ రైనా (63; 45 బంతుల్లో 2×4, 5×6) ఓపెనర్‌ లోకేశ్‌ రాహుల్‌ (22; 18 బంతుల్లో 2×4, 1×6)తో కలిసి చెలరేగాడు. వరుసగా సిక్సర్లు, బౌండరీలు బాదాడు. 65 పరుగుల వద్ద లోకేశ్‌ వెనుదిరగడంతో క్రీజులోకి వచ్చిన టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని (56; 36 బంతుల్లో 5×4, 2×6) కెరీర్‌లో తొలి అర్ధశతకం బాదాడు. చక్కని షాట్లతో అలరించాడు.
 
రైనా తర్వాత క్రీజులోకి వచ్చిన యువరాజ్‌సింగ్‌ (27; 10 బంతుల్లో 1×4, 3×6) ) ఇంగ్లాండ్‌కు మళ్లీ తన సిక్సర్ల రుచి చూపించాడు. క్రిస్‌ జోర్డాన్‌ వేసిన 18వ ఓవర్లో వరుసగా 6,6,4,6,1 పరుగులు రాబట్టాడు. యువీ సిక్సర్ల హోరు చూసి జోర్డాన్‌ తలపట్టుకొన్నాడు. ఐతే ఆ తర్వాత ఓవర్‌లో తైమల్‌ మిల్స్‌ వేసిన తొలి బంతిని అంచనా వేయలేకపోయిన యువీ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేసిన రిషబ్‌ పంత్‌ (5), హార్దిక్‌ పాండ్య (11) ఫర్వాలేదనిపించడంతో భారత్‌ 6 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది.