ఆదివారం, 13 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 9 ఏప్రియల్ 2025 (16:37 IST)

కదిలే రైలులో సెల్ ఫోన్ కొట్టేయబోయి అడ్డంగా దొరికిన దొంగ, రైలుతో ఈడ్చుకెళ్లారు (video)

thief was caught
మొబైల్ ఫోన్ దొంగలు రైల్వే స్టేషన్లలో కాచుకుని కూర్చుంటారు. అలా బండి బయలుదేరుతూ వుండగా... కిటికీ పక్కనో లేదంటే డోర్ వద్దనో సెల్ ఫోనులో మాట్లాడేవారి ఫోన్లను కొట్టేస్తుంటారు. అలా వేలమంది ప్రయాణికుల నుంచి వారి సెల్ ఫోన్లను తస్కరించే దొంగల ముఠా బీహారులోని పాట్నా రైల్వే స్టేషను వద్ద మరోసారి ఫోన్లను కొట్టేసేందుకు ప్రయత్నించింది.
 
ఈ ప్రయత్నంలో ఓ దొంగ ప్రయాణికుల చేతికి దొరికిపోయాడు. కదిలి వెళుతున్న రైలు వెంట పరుగుపెడుతో బయట నుంచి కిటికీ లోపల చేయి పెట్టి సెల్ ఫోన్ దొంగిలించబోయాడు. ఐతే సదరు ప్రయాణికులు ఆ దొంగను అత్యంత చాకచక్యంగా పట్టేసారు. అతడిని వదల్లేదు. దీనితో అతడు కిలో మీటరు మేర రైలుతో వేలాడుతూ ప్రయాణించాడు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.