గురువారం, 6 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 5 మార్చి 2025 (15:45 IST)

Ranga Reddy: భర్తను రెడ్ హ్యాడెండ్‌గా పట్టుకున్న భార్య- గోడదూకి పారిపోయిన భర్త (video)

Woman
Woman
వివాహేతర సంబంధాలతో భార్యాభర్తల అనుబంధం మంటగలిసిపోతోంది. తన భర్త తనను పట్టిచుకోకుండా.. వేరొక మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించడం తెలుసుకుని షాకైంది. అయితే అంతటితో ఆగకుండా భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పరిధిలో చోటుచేసుకుంది. తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను భార్య చితకబాదింది. 
 
భార్యను చూడటంతో భర్త గోడ దూకి పారిపోయాడు. తన తండ్రి మరణిస్తే వచ్చిన డబ్బులు తీసుకుని వ్యాపారం పెడతానని చెప్పి రూ.30 లక్షల నగదు, కారు, స్కూటీ, బంగారాన్ని తన ప్రియురాలికి తన భర్త ఇచ్చాడని భార్య ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హయత్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.