శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 19 జూన్ 2024 (18:02 IST)

సెల్ ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూసి కూతురుపై అత్యాచార యత్నం, హత్య

కన్నకూతురు పట్ల కామాంధుడయ్యాడు తండ్రి. 12 ఏళ్ల బాలికపై అఘాయిత్యం చేసేందుకు ప్రయత్నించి ఆమె ప్రతిఘటించడంతో గొంతు నులిమి చంపేసాడు. ఆ తర్వాత ఏమీ ఎరగనట్లు తన కుమార్తె మిస్ అయ్యిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేయడంతో కన్నతండ్రే కిరాతకుడని తేలింది. హైదరాబాదులోని మియాపూర్ పరిధిలో జరిగిన ఈ దారుణ ఉదంతాన్ని పోలీసులు మీడియాకు తెలిపారు.
 
" ఈ నెల 7వ తేదీ రాత్రి మియాపూర్ పరిధిలో వుండే తండాకు చెందిన వ్యక్తి తన కుమార్తె కనిపించడం లేదంటూ కంప్లైంట్ ఇచ్చాడు. దానితో పోలీసులు అంతా నాలుగు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించాం. 13వ తారీఖున రాత్రి కుళ్లిన స్థితిలో మృతదేహం కనిపించింది. మృతదేహంపై వున్న దుస్తుల ఆధారంగా తప్పిపోయిన బాలికదే ఆ మృతదేహంగా గుర్తించారు. కాగా 7వ తేదీ రాత్రి తన కుమార్తె మారాం చేసి ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని చెప్పాడు ఆమె తండ్రి.
 
సీసీ కెమేరాలను పరిశీలించగా... అతడు తన కుమార్తెను మియాపూర్ వైపు బైకుపై ఎక్కించుకుని వెళ్లాడు. నడికండ తండాకు ఎదురుగా బైకును ఆపి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఏం జరిగిందో తెలియదు. ఇంటికి వచ్చి తన భార్యతో బాలిక మిస్సింగ్ అని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఐతే అతడి వ్యవహారంపై పోలీసులకి అనుమానం కలిగింది. సేకరించిన ఆధారాలు అనుసరించి తండ్రే హంతకుడని పోలీసులు నిర్ణయానికి వచ్చారు.
 
ఈ లోపుగానే తను చేసిన దారుణాన్నంతా మరో వ్యక్తికి చెప్పి పోలీసుల ఎదుట లొంగిపోతానని చెప్పాడు. హంతకుడు మద్యానికి బానిస, అశ్లీల చిత్రాలు చూస్తుంటాడు. రెండ్రోజుల నుంచి ఫోన్ డిస్ ప్లే పనిచేయలేదు. దాంతో పిచ్చివాడిలా మారిపోయిన ఆ వ్యక్తి... కుమార్తెను అడవిలోకి తీసుకెళ్లి అసభ్యకరంగా తాకాడు. ఫోనులో ఏం చూసాడో అవన్నీ బాలికపై చేసేందుకు ప్రయత్నించడంతో బాలిక తీవ్రంగా ప్రతిఘటించింది. దాంతో జుట్టు పట్టుకుని కింద పడేసాడు. ఆ తర్వాత గొంతు నులిమి చంపేసాడు.'' అని పోలీసులు వెల్లడించారు.