శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 14 జూన్ 2024 (12:22 IST)

న్యూయార్క్‌లో మస్తు మజా చేస్తున్న అనుష్క శర్మ

Anushka Sharma
Anushka Sharma
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, అనుష్క శర్మ న్యూయార్క్‌లో తన కుమార్తె వామికతో ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తోంది. టీ-20 వరల్డ్ కప్ 2024 కోసం తన క్రికెటర్-భర్త విరాట్ కోహ్లీకి మద్దతు ఇవ్వడానికి న్యూయార్క్ వెళ్లిన ఆమె... వామిక, అకాయ్‌తో కలిసి ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల, తల్లీకూతుళ్లిద్దరూ ఐస్‌క్రీమ్ పార్టీ చేసుకున్నారు. 
 
అనుష్క చిన్ననాటి స్నేహితురాలు నైమీషా మూర్తి సోషల్ మీడియాలో ఒక వీడియోను పంచుకున్నారు. వీడియోలో, అనుష్క తన సింపుల్ దుస్తులు ధరించి, ఐస్‌క్రీమ్ పార్లర్ వైపు నడుస్తూ కనిపించింది. ఆమె తన ఆడపిల్ల వామికతో కలిసి మెట్లు ఎక్కడం చూడవచ్చు. 
 
మరో వైరల్ వీడియోలో అనుష్క - విరాట్ హోటల్ లోపలికి వెళ్తున్నప్పుడు వామిక చేతులు పట్టుకున్నట్లు నడుస్తున్నట్టు వుంది. ఈ వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.