గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 మార్చి 2024 (10:06 IST)

యువతిని వివస్త్రను చేసి.. దారుణంగా కడతేర్చారు.. కుళ్లిన స్థితిలో మృతదేహం... ఎక్కడ?

murder
కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరు నగరంలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. ఆ యువతిని వివస్త్రను చేసి హత్య చేశారు. హత్య జరిగిన ఐదు రోజుల తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ యువతి మృతదేహం కుళ్లిన స్థితిలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బెంగళూరు నగర శివార్లలోని చందాపుర హెడ్‌మాస్టర్‌ లేఔట్‌ నాలుగో అంతస్తులో కుళ్లిన స్థితితో ఉన్న ఓ యువతి నగ్న మృతదేహాన్ని స్థానిక సూర్యనగర పోలీసులు స్వాధీనం చేసుకుని ఆసుపత్రికి తరలించారు. ఐదురోజుల కిందటే హత్య జరిగి ఉంటుందని పోలీసులు మంగళవారం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒడిశా నివాసి సపన్‌కుమార్‌ ఆ ఇంట్లో నివసించే వాడని గుర్తించారు. అతడితో కలిసి ఆమె (28) ఉండేదని అనుమానిస్తున్నారు. 
 
హత్యకు ముందు.. వారిద్దరూ మద్యం తాగారని అక్కడి పరిస్థితులు చెబుతున్నాయి. మృతదేహం చుట్టుపక్కలంతా మద్యం సీసాలు, సిగరేట్లు, భోజనం పొట్లాలు పడున్నాయి. ఐదురోజుల నుంచి ఇంటి తలుపులు తీయలేదు. దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి తలుపులు పగలకొట్టి లోపలకు ప్రవేశించి చూస్తే.. ఆమె నగ్న మృతదేహం కనిపించింది. ఆమె ఎవరనే వివరాలూ తెలియలేదు. సవన్‌కుమార్‌ ఫోన్‌ ప్రస్తుతం పనిచేయడం లేదని అధికారులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.