శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (14:31 IST)

ఆటోలో తిప్పుతూ బాలికపై 8 మంది అత్యాచారం

మహారాష్ట్రలోని పుణెలో బాలికపై 8 మంది కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. తన స్నేహితుడిని కలిసేందుకు రైల్వే స్టేషన్లో 13 ఏళ్ల బాలిక రైలు కోసం ఎదురుచూస్తూ వుంది. ఈమె ఇంట్లో చెప్పకుండా పారిపోయి వచ్చింది. ఒంటరిగా రైల్వే స్టేషనులో కూర్చుని వుండగా ఆమెను ఓ ఆటోడ్రైవరు గమనించాడు.
 
కోవిడ్ కారణంగా ఆమె ఎక్కాల్సిన రైలు ఆరోజు రావడంలేదని ఆమెకి మాయమాటలు చెప్పాడు. ఈ రాత్రికి తన ఇంట్లో వుండమని ఆమెను ఒప్పించి ఆటోలో ఎక్కించుకున్నాడు. అలా వెళ్తూ వుండగానే సహచర ఆటోడ్రైవర్లకు సమాచారం ఇచ్చాడు. వారంతా ఆటో వెళ్తుండగా మధ్యలో ఎక్కారు.
 
అలా ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అంతా కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆ బాలికను ముంబై వెళ్లే బస్సు ఎక్కించి పారిపోయారు. బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను పోలీసులు గాలించారు. మొత్తం 8 మందిలో ఏడుగురిని అదుపులోకి తీసుకోగా మరో నిందితుడు పరారీలో వున్నాడు.