1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 26 మే 2025 (12:35 IST)

హింసిస్తూ సామూహిక అత్యాచారం, హత్య: ప్రైవేట్ పార్ట్‌లో ఐరన్ రాడ్

crime
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖాండ్వా పరిధిలో ఢిల్లీ నిర్భయ సామూహిక అత్యాచారం తరహా దారుణం జరిగింది. కామాంధులు ఓ గిరిజన మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను పదునైన ఆయుధాలతో హింసించారు. అత్యాచారం తర్వాత ఆమె ప్రైవేట్ భాగంలో ఐరన్ రాడ్ చొప్పించడంతో ఆమె గర్భాశయం బైటకు వచ్చేసింది. దీనితో తీవ్ర రక్తస్రావం జరిగి బాధితురాలు అక్కడికక్కడే మృతి చెందింది.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. శనివారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో గిరిజన ప్రాంతమైన రోషిణి చౌకిలో ఇద్దరు పిల్లల తల్లిపై గ్యాంగ్ రేప్ జరిగింది. తల్లి అపస్మారక స్థితిలో వున్నట్లు సమాచారం అందుకున్న ఆమె కుమార్తె అక్కడికి వెళ్లింది. అప్పటికే ఆమె తల్లి ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతోంది. ఆమె ప్రైవేట్ పార్టులో ఐరన్ రాడ్ పెట్టి పొడిచి బైటకు లాగడంతో గర్భాశయం బైట నేలపై పడి కనిపించింది. ఈ భీతావహ పరిస్థితిలో తల్లిని చూసి కుమార్తె సొమ్మసిల్లిపోయింది. ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు.
 
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులను గుర్తించారు. మహిళ ఇంట్లోనే నివాసం వుంటున్న ఒకడు, మరో వ్యక్తితో కలిసి ఇద్దరూ ఆ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డట్లు ప్రాధమికంగా తేల్చారు. ఆ ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంతటి దారుణ హత్యకు కారాణాలు ఏమిటన్నది దర్యాప్తులో తేలుతుందని చెప్పారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.