లిఫ్ట్ పేరుతో నమ్మించి... జర్మనీ యువతిపై అత్యాచారం
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. లిఫ్ట్ ఇస్తామని నమ్మించి జర్మనీకి చెందిన ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
సోమవారం రాత్రి మీర్‌పేట ప్రాంతంలో జర్మనీకి చెందిన ఓ యువతి నడుచుకుంటూ ఒంటరిగా వెళుతోంది. ఆమెపై కన్నేసిన ముగ్గురు యువకులు లిఫ్ట్ ఇస్తామని నమ్మించి ఆమెను మీర్‌పేట మందమల్లమ్మ సెంటరులో కారులో ఎక్కించుకున్నారు.
ఆ తర్వాత కారులో తిప్పుతూ ఆమెపై ఒకరి తర్వాత ఒకరు సమూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గ్యాంగ్ రేప్ తర్వాత ఆమెను నిర్మానుష్య ప్రాంతంలో వదిలి వెళ్లారు. తనకు జరిగిన ఘోరంపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో ఉండే సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.