ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 7 సెప్టెంబరు 2022 (13:06 IST)

హైదరాబాద్‌ ఐఐటీలో విద్యార్థి ఆత్మహత్య

suicide
హైదరాబాద్ ఐఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే విద్యా సంస్థలో ఎంటెక్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన విషయం తెల్సిందే. ఈ ఘటన మరుకముందే మరొకరు బవన్మరణానికి పాల్పడ్డాడు.
 
రాజధాని జోధ్‌పూర్‌కు చెందిన మెగా కపూర్ ఐఐటీలో బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. గత కొన్ని రోజులుగా సంగారెడ్డిలో ఓ లాడ్జిలో ఉంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం లాడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేసున్నారు. మృతిదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానాకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.