గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 సెప్టెంబరు 2022 (12:49 IST)

IIT హైదరాబాద్‌ విద్యార్థి ఆత్మహత్య

crime photo
సంగారెడ్డిలోని ఓ లాడ్జిపై నుంచి దూకి విద్యార్థి మెగ్‌కపూర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. మెగ్‌కపూర్‌ హైదరాబాద్‌ ఐఐటీలో 3 నెలల క్రితం బీటెక్ పూర్తి చేశాడు. గత 3 నెలలుగా సంగారెడ్డిలోని ఓ లాడ్జిలో నివాసం మెగ్‌కపూర్‌ ఉంటున్నాడు. విద్యార్థి మెగ్‌కపూర్‌ స్వస్థలం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ గ్రామం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. 
 
బీటెక్‌ కెమికల్‌ ఇంజనీరింగ్‌ చదువుతున్న మెఘ్‌కపూర్‌ సంగారెడ్డి పోతిరెడ్డిపల్లిలోని ఓ హోటల్‌పై నుంచి దూకి సూసైడ్‌ చేసుకున్నాడు. విద్యార్థి మేఘాకపూర్‌ స్వస్థలం రాజస్థాన్‌లోని జోధ్ పూర్. అతని తండ్రి బిజినెస్‌ మేన్‌ అని అధికారులు పేర్కొంటున్నారు. 
 
IIT హైదరాబాద్‌లో మూడు నెలల క్రితమే B.TECH పూర్తి చేసిన మేఘాకపూర్.. 3 నెలల నుంచి సంగారెడ్డి లోని ఓ లాడ్జిలో రూమ్ తీసుకుని ఉంటున్నట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదు.