బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 సెప్టెంబరు 2022 (10:59 IST)

సస్పెండ్ పై వెళ్తున్న వార్డెన్ ను అడ్డుకున్న విద్యార్థులు

Students
Students
సస్పెండ్ పై వెళ్తున్న వార్డెన్ ను వెళ్లొద్దంటూ విద్యార్థులు బోరున విలపించారు. పిల్లల ఏడుపు చూసిన స్థానికులు, తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. సదరు వార్డెన్‌ పట్ల విద్యార్థులకున్న అభిమానానికి అందరూ వాపోయారు. వరంగల్‌ జిల్లా వర్థన్నపేట గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో అరుదైన ఘటన చోటుచేసుకుంది.  
 
వివరాల్లోకి వెళితే, వర్ధన్నపేట హాస్టల్‌లో సోమవారం రోజున ఫుడ్ పాయిజన్‌ జరిగి 60మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో వార్డెన్‌పై వేటు వేశారు జిల్లా కలెక్టర్‌. 
 
హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ జరగడంతో 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. వీరిలో ఐదుగురు పిల్లల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.  
 
దీంతో రిలీవ్‌ అయి వెళ్తున్న వార్డెన్‌ను అడ్డుకొని వెళ్లొద్దంటూ కన్నీటి పర్యంతమయ్యారు విద్యార్థినులు. అంతేకాదు, వంటమనిషి తప్పిదానికి..వార్డెన్‌ను అకారణంగా సస్పెండ్‌ చేశారంటూ ఆందోళనకు దిగారు. సస్పెన్షన్‌ ఎత్తివేసి వార్డెన్‌ను యథావిథిగా కొనసాగించాలని హాస్టల్‌ ముందు ధర్నా నిర్వహించారు.