మంగళవారం, 5 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

భారత్ పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ : శ్రీనగర్ నిట్ విద్యార్థులకు వార్నింగ్

india pak
ఆసియా క్రికెట్ టోర్నీలో భాగంగా, ఆదివారం రాత్రి 7.30 గంటలకు దాయాది దేశాలైన భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య కీలక పోరు జరుగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో శ్రీనగర్‌లోని నిట్ విద్యార్థులకు అధికారులు కీలక సూచనలతో పాటు హెచ్చరికలు జారీచేశారు. ఈ మ్యాచ్‌ను విద్యార్థులు గ్రూపులుగా విడిపోయి వీక్షించరాదని హెచ్చరిక చేశారు. పైగా, విద్యార్థులు తమతమ హాస్టల్ గదుల్లోని బయటకు రావొద్దని, మ్యాచ్ జరిగే సమయంలోనూ, మ్యాచ్ ముగిసిన తర్వాత సోషల్ మీడియాలో ఎలాంటి కామెంట్స్ చేయరాదని కోరారు. ఒకవేళ తమ హెచ్చరికలను పట్టించుకోకుంటే హాస్టల్ నుంచి డీబార్ చేస్తామని హెచ్చరించారు. 
 
సాధారణంగా ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఇరు దేశాల్లో ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొంటాయి. ఇక విద్యాసంస్థల్లో పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా, ముస్లిం యువత ప్రాబల్యం ఉండే విద్యా సంస్థల్లో వాతావరణం నివురు గప్పిన నిప్పులా ఉంటుంది. ఈ క్రమంలో శ్రీనగర్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) విద్యార్థులకు ఆ విద్యా సంస్థ అధికారుల నుంచి కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. భారత్ పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్‌ను బృందాలుగా వీక్షించరాదని ఆదేశించారు. 
 
మ్యాచ్ సందర్భంగా విద్యార్థులు తమకు కేటాయించిన గదుల్లోనే ఉండాలని, ఇతరుల గదుల్లోకి వెళ్లరాదని ఆదేశాలు జారీచేశారు. ఒకవేళ తమ ఆదేశాలను ధిక్కరించి గ్రూపులుగా మ్యాచ్‌ను వీక్షిస్తే హాస్టల్ నుంచి డీబార్ చేస్తామని హెచ్చరించారు. మ్యాచ్ ముగిసిన తర్వాత సోషల్ మీడియాలో ఎలాంటి కామెంట్స్ చేయరాదని కోరారు.