బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 14 ఆగస్టు 2022 (19:28 IST)

కైరో అబు సిఫైనే చర్చిలో ఘోరం..41 మంది సజీవదహనం

church fire
ఈజిప్టులోని కైరో అబు సిఫైనే చర్చిలో ఘోరం జరిగింది. ఈ చర్చిలో మంటలు చెలరేగి ఏకంగా 41 మంది సజీవదహనమయ్యారు. చర్చిలో మంటలు చెలరేగిన వెంటనే తప్పించుకునే మార్గం లేక మంటల్లో కాలి బూడిదైపోయారు. 
 
ఆదివారం కావడంతో అనేక మంది భక్తులు చర్చిలో ప్రార్థనలు జరిపేందుకు వచ్చారు. ఆ సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో తప్పించుకునే వీల్లేక పదుల సంఖ్యలో మృతి చెందారు. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని చర్చి వర్గాలు వెల్లడించాయి. 
 
సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ తీవ్రంగా శ్రమించి మంటలను అదుపుచేసింది. ఈ ఘటనపై ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సంఘటన స్థలంలో తక్షణం సహాయక చర్యలు చేపట్టాలంటూ ప్రభుత్వ శాఖలను ఆదేశించారు.