సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 సెప్టెంబరు 2022 (14:59 IST)

పాఠశాల గేటుపై నాగుపాము.. జడుసుకున్న స్టూడెంట్స్, టీచర్స్

Snake
పాఠశాల గేటుపై నాగుపాము కనిపించడంతో విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో భయాందోళనలు నెలకొన్నాయి మరియు ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వీక్షకులను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ఈ దారుణ ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. పాఠశాల గేటు వద్ద పామును గుర్తించిన పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులకు, స్థానికులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన గ్రామస్తులు పామును పాఠశాల నుంచి బయటకు తీశారు. 
 
ఈ ఘటనతో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. అధికారులు తగు చర్యలు తీసుకోవాలని పిల్లల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.