సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (19:31 IST)

చేతులు కాల్చుకున్న శ్రీనిధి.. కేజీఎఫ్ తర్వాత కోబ్రా పడేసిందిగా..

Sri Nidhi Shetty
Sri Nidhi Shetty
శ్రీనిధి శెట్టి చేసిన సినిమాలకంటే, హీరోయిన్ కావడానికి ముందు మోడలింగ్‌లో అత్యధిక పారితోషికాన్ని అందుకుంటున్న వారిలో ఆమె ఒకరు. అలాంటి ఆమె 'కేజీఎఫ్' సినిమాతో వెండితెరకి పరిచయమైంది. ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. 
 
ఆ తరువాత ఆమె 'కేజీఎఫ్ 2' పైనే పూర్తి దృష్టి పెట్టింది. ఆ సినిమా సమయంలో ఆమె 'కోబ్రా' సినిమా తప్ప మరో సినిమా చేయలేదు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొడితే పారితోషికం పరంగా ఆమెను పట్టుకోవటం కష్టమని అంతా అనుకున్నారు. అయితే, తమిళనాట మొన్న విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది.
 
ఇక తెలుగులోను ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. దాంతో శ్రీనిధి శెట్టి ఆశలన్నీ ఆవిరైనట్టేననే టాక్ బలంగా వినిపిస్తోంది. 'కేజీఎఫ్ 2' తరువాత ఆమె వరుస సినిమాలను అంగీకరించి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క సినిమా కూడా లేదట.