శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 ఫిబ్రవరి 2023 (16:53 IST)

కాలువ పక్కన ఉన్న మూటను విప్పి చూడగా నగ్నంగా మహిళ మృతదేహం

deadbody meerut
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో ఓ కాలువ పక్కన గోనె సంచిలో ఉన్న మూటను విప్పి చూడగా అందులో నగ్నంగా ఓ మహిళ మృతదేహం కనిపించింది. దీన్ని చూసిన స్థానికులు షాక్‌కు గురయ్యారు. పైగా, ఈ గోనె సంచి మూటను ఓ వ్యక్తి పగలంతా భుజాన వేసుకుని తిరిగాడు. చివరకు ఓ మురికి కాలువ పక్కన పడేశాడు. దీన్ని విప్పి చూసిన స్థానికులకు షాక్‌కు గురయ్యారు. నగ్నంగా మహిళ మృతదేహం ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. 
 
మీరట్ పరిధిలోని ఖర్ఖోడా సమీపంలో ఉన్న జమున నగర్ అనే ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకంది. స్థానికంగా ఉన్న ఓ కాలువ వద్ద గోనె సంచి మూట ఉండటాన్ని గమనించిన స్థానికులు... ముందుగా దానివద్దకు వెళ్లేందుకు సంకోచించారు. ఈ విషయం చుట్టుపక్కల వారికి తెలిసింది. దీంతో అక్కడకు చేరుకున్న కొందరు వ్యక్తులు ధైర్యం చేసి గోనె సంచిని విప్పి చూశారు. 
 
లోపల మహిళమ మృతదేహం నగ్నంగా ఉండటాన్ని చూసి అందరూ షాక్ అయ్యారు. ఆ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పైగా, పలంతా గోనె సంచి మూటను భుజాన వేసుకుని తిరిగిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు.