యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యూపీలోని నోయిడా సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
బాదల్‌పూర్ ప్రాంతంలోని హీరో మోటార్ కంపెనీ కార్మికులు రాత్రి షిఫ్ట్ తర్వాత ఫ్యాక్టరీ నుండి బయటకు వచ్చారు. వారిని బస్సు ఢీకొట్టింది.
ముగ్గురు కార్మికులు సంఘటనా స్థలంలోనే అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఢిల్లీకి తరలించారు.