ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 22 జనవరి 2023 (17:32 IST)

భార్య ప్రియుడ్ని 15 ముక్కలుగా నరికేసిన రిక్షా కార్మికుడు.. ఎక్కడ?

murder
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో దారుణం జరిగింది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని రిక్షా కార్మికుడు హత్య చేసి ఏకంగా 15 ముక్కలు చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మిలాల్ ప్రజాపతి అనే వ్యక్తి ఒక రిక్షా కార్మికుడు. రాజస్థాన్‌‌లోని కోట్‌పుట్లీకి చెందిన అక్షయ్ కుమార్‌ కూడా ప్రజాపతి ఇంటికి సమీపంలోనే నివసిస్తున్నాడు. ఈయనకు తన భార్యకు మధ్య వివాహేతర సంబంధం ఉందని అనుమానించాడు. 
 
ఈ నేపథ్యంలో గురువారం అతడిని ఇంటికి పిలవాలని భార్యతో చెప్పాడు. దీంతో అక్షయ్ కుమార్‌కు ఆమె ఫోన్ చేసి ఇంటికి రావాలని కోరింది. దీంతో గురువారంసాయంత్రం ఇంటికి వచ్చాడు.
 
కుమార్తెకు కాలిన గాయాలు కావడంతో చికిత్స కోసం ప్రజాపతి భార్య ఢిల్లీలోని ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే ఇంటికి వచ్చిన అక్షయ్‌ కుమార్‌తో ప్రజాపతి మద్యం తాగించాడు. ఆ తర్వాత రాత్రి వేళ గొడ్డలితో దాడి చేసి అతడ్ని హత్య చేశాడు. 
 
అక్షయ్‌ మృతదేహాన్ని 15 ముక్కలుగా సరికాడు. వాటిని మూడు బ్యాగుల్లో ఉంచాడు. శుక్రవారం తెల్లవారుజామున 1 గంటకు తన రిక్షాలో తీసుకెళ్లి ఖోడా కాలనీ ప్రాంతంలో పడేశాడు.
 
మరోవైపు స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్షయ్‌ మృతదేహం ముక్కలు ఉన్న బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. నిందితుడు ప్రజాపతిని గుర్తించి అతడ్ని అరెస్ట్‌ చేశారు.