ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్

యూపీ ఘోరం... రోడ్డు దాటుతున్న పాదాచారులపైకి దూసుకెళ్లిన డంపర్...

road accident
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావ్‌లో దారుణం జరిగింది. రోడ్డు దాటుతున్న వారిపైకి ఓ డంపర్ (ట్రక్కు) దూసుకెళ్లింది. ఆ తర్వాత రోడ్డు పక్కనే ఉన్న మారుతీ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
వేగంగా దూసుకొచ్చిన ఓ డంపర్ రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళలు సహా ఓ యువకుడిపై దూసుకెళ్లింది. అనంతరం రోడ్డు పక్కనే ఆగివున్న మారుతీ కారును ఢీకొట్టి కొంతదూరం లాక్కెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో రోడ్డు దాటుతున్న ముగ్గురు పాదాచారాలు, మారుతి కారులో ఉన్న ముగ్గురు ప్రయాణికులు మరణించారు.
 
దీంతో స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆదివారం రాత్రి కాన్పూర్ - లక్నో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. మృతులను శకుంతల, శివానీలుగా గుర్తించారు. అలాగే, కారులో చనిపోయిన వారిని విమలేశ్ కుమార్, శశాంక్‌, పూరణ్ దీక్షిత్‌, మరో వ్యక్తిగా గుర్తించారు.