బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 18 జనవరి 2023 (15:35 IST)

ఉక్రెయిన్‌లో ఘోర హెలికాఫ్టర్ ప్రమాదం ... హోం మంత్రితో సహా 16 మంది మృతి

Helicopter Crash
రష్యా దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఉక్రెయిన్ దేశంలో మరో పెను విషాదం చోటుచేసుకుంది. ఈ దేశంలో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో హోం మంత్రితో పాటు 16 మంది మృత్యువాతపడ్డారు. కీవ్ నగర శివారు ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో హోం మంత్రి, డిప్యూటీ హోం మంత్రి మృతి చెందారు. మొత్తం 16 మంది చనిపోగా, వారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. 
 
ఈ హెలికాఫ్టర్ కీవ్ నగర శివారుల్లోని ఓ కిండర్ గార్డెన్ పాఠశాల సమీపంలో కూలిపోయింది. కూలిపోయిన్ ఈ హెలికాఫ్టర్ ఉక్రెయిన్ ప్రభుత్వం ఎమర్జెన్సీ సేవల విభాగానికి చెందినదిగా పోలీసులు వెల్లడించారు. హెలికాఫ్టర్ కూలిపోయిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని పలువురు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.
 
కాగా, హెలికాఫ్టర్ కూలిపోయిన వెంటనే స్పందించిన అధికారులు కిండర్ గార్డెన్‌లోని చిన్నపిల్లలను, సిబ్బందిని సురక్షితంగా తరలించారు. పాఠశాల భవనం వద్ద హెలికాఫ్టర్ శకలాలు చెల్లాచెదురుగా పడ్డాయి. పైగా, ఈ ప్రమాదం జరిగిన ప్రాంతంలో వెలుతురు కూడా సరిగా లేదని, దట్టమైన పొగమంచు అలముకుని ఉందని తెలుస్తోంది.