బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 30 జనవరి 2024 (08:16 IST)

ఢిల్లీలో దారుణం.. అసహజ శృంగారానికి ఒత్తిడి చేసిన యువకుడి హత్య

murder
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. అసహజ శృంగారానికి అంగీకరించాలంటూ ఒత్తిడి చేసిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జనవరి 19వ తేదీ ఢిల్లీలోని మోరీ గేటు దగ్గరలోని డీడీఏ పార్క్ వద్ద గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు స్థానికుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో ఘటనాస్థలికి పోలీసులు వెళ్లి పరిశీలించగా.. మృతుడి శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నాయి. పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. 
 
ఆ తర్వాత విచారణలో భాగంగా, స్థానికంగా ఉన్న 50 సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. మృతుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జలాన్ జిల్లాకు చెందిన ప్రమోద్ కుమార్ శుక్లాగా గుర్తించారు. శుక్లా కోయా మండిలోని ఓ దుకాణంలో పనిచేసేవాడు. నైట్ షెల్టర్‌లో ఉంటున్నాడు. 
 
ఫుటేజీలో శుక్లాతో పాటు రాజేశ్ అనే వ్యక్తి చివరిసారిగా కనిపించాడు. దీంతో అతడిని బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయగా విషయం బయటకు వచ్చింది. తనను శుక్లా అసహజ శృంగారంలో పాల్గొనాలని ఒత్తిడి చేసేవాడని నిందితుడు చెప్పాడు. దీంతో అతడిని హత్య చేసేందుకు ప్రణాళిక వేసుకుని హత్య చేసినట్లు రాజేశ్ పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. తలపై బండ రాయితో మోది హత్య చేసినట్టు చెప్పారు.