1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 జనవరి 2024 (22:42 IST)

ఢిల్లీలో రెండేళ్ల బాలుడిపై పెంపుడు కుక్క దాడి.. కాపాడిన తల్లి

Dog Attacks
Dog Attacks
ఢిల్లీలోని విశ్వాస్ నగర్ ప్రాంతంలో రెండేళ్ల చిన్నారిపై శునకం దాడి చేసింది. పెంపుడు కుక్కగా గుర్తించిన ఆ కుక్క పిల్లవాడిపైకి దూసుకెళ్లింది. రెండేళ్ల బాలుడి కాలిని పట్టుకుంది. సిసిటివి కెమెరాలో ఈ షాకింగ్ సంఘటన రికార్డ్ అయ్యింది. 
 
కుక్కపై ఆగ్రహంతో కుక్క దాడి నుండి తన బిడ్డను రక్షించడానికి తల్లి విశ్వప్రయత్నాలు చేసింది. ఈ ప్రయత్నంలో సక్సెస్ అయ్యింది. పిల్లవాడి దగ్గరకు పరుగెడుతూ వెళ్లిన కుక్క ఆ చిన్నారిని నోటితో లాగుతున్నట్లు వీడియోలో రికార్డ్ అయ్యింది. 
 
వెంటనే, స్థానికులు, బాలుడి తల్లి తీవ్రంగా ప్రయత్నించారు. అయితే బిడ్డపై ఆ శునకం పదేపదే దూకి దాడి చేసింది. అయినా స్థానికులు దానిని వదలక తరిమికొట్టారు. ఈ ఘటనలో తల్లీబిడ్డ ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలియాల్సి వుంది.