బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 ఫిబ్రవరి 2024 (08:57 IST)

ఇక నీ మొగుడు బయటకు రాడుగానీ.. నాతో రా అన్నీ నేనే చూసుకుంటా...

harassment
ఇక నీ మొగుడు బయటకు రాడు.. నాతో రా... అన్నీ నేనే చూసుకుంటాను అంటూ ఓ మోసం కేసులో అరెస్టు అయిన నిందితుడి భార్యను ఓ పోలీస్ కానిస్టేబుల్ లైంగికంగా వేధించాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా దాచేపల్లి పోలీస్ స్టేషన్‌లో జరిగింది. అధికార వైకాపా నేతల అండతో మదమెక్కిన ఆ పోలీస్ కానిస్టేబుల్ అన పోలీస్ పవర్ మార్కుతోపాటు కండకావరాన్ని చూపించాడు. అతని వేధింపులు భరించలేని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను ఆ మహిళ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
 
"నా భర్త దొంగతన కేసులో అరెస్టయి పోలీస్ స్టేషనులో ఉన్నాడనీ, ఆ స్టేషన్‌కు చెందిన ఓ కానిస్టేబుల్ తన ఇంటికి వచ్చి మీ భర్తపై పలు కేసులు ఉన్నాయి. యేడాది వరకు ఇంటికి రాడు. ఇక అతనితో నీకు పనిలేదు. అన్నీ నేనే చూసుకుంటాను. నా కోరిక తీర్చుతూ నాకు సహకరించు" అంటూ వేధిస్తున్నాడని బోరున విలపిస్తూ వెల్లడించింది. మూడు నెలల గర్భిణిగా ఉన్న తనకు అతని వేధింపుల కారణంగా అబార్షన్ కూడా అయిందని తెలిపింది. తనకు, తన కుటుంబానికి ఆ పోలీస్ కానిస్టేబుల్ నుంచి రక్షణ కల్పించాలని వేడుకుంది. కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు.. తగిన విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు.