శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 22 జులై 2022 (11:37 IST)

పెళ్ళికి నిరాకరించిన యువతి... తల తెగనరికి స్టేషన్‌కు తీసుకెళ్లిన కిరాతకుడు

murder
కర్నాటక రాష్ట్రంలోని విజయనగర జిల్లాలో దారుణం జరిగింది. తనతో వివాహానికి నిరాకరించిన యువతి తల తెగనరికిన ఓ యువకుడు.. ఆమె తలను చేతపట్టుకుని పోలీస్ స్టేషన్‍‌కు వెళ్లి లొంగిపోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని కూడ్లగి తాలూకా కన్నిబొరయ్యహట్టికి చెందిన భోజరాజ అనే యువకుడు స్థానికంగా ట్రాక్టర్ డ్రైవరుగా ఉంటున్నారు. ఈయన సమీప బంధువు నిర్మల (21) అనే యువతిని ఏకపక్షంగా ప్రేమిస్తూ వచ్చాడు. ఈమె నర్సింగ్ చేస్తుంది. తన ప్రేమను అంగీకరించిన నిర్మలను తనకిచ్చి పెళ్లి చేయాలని ఆ యువతి తల్లిదండ్రును కోరగా వారు నిరాకరించారు. 
 
దీంతో ఆ యువతిపై కక్ష పెంచుకున్న భోజరాజ... నిర్మల ఇంటికి ఎవరూ లేని సమయంలో వెళ్లి ఆమెతో ఘర్షణకు దిగాడు. వారి మధ్య మాటామాటా పెరిగి తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె తల తెగనరికేశాడు. ఆ తర్వాత తలను పెట్టుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు భోజరాజను అరెస్టు చేశారు.