మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Updated : సోమవారం, 30 జనవరి 2017 (14:09 IST)

హే రామ్ అంటూ నేలకొరిగిన గాంధీజీ... చితాభస్మంతో ఇందిరా గాంధీ

జనవరి 30, 1948 భారతదేశానికో దుర్దినం. ఢిల్లీలో బిర్లా నివాసం వద్ద ప్రార్థనా సమావేశానికి వెళ్తుండగా మహాత్మాగాంధీజీని నాథూరామ్ గాడ్సే కాల్చి చంపిన మహా చెడ్డ రోజు ఆ రోజు. గాడ్సే... గాంధీజీని తను ఎలా చంపా

జనవరి 30, 1948 భారతదేశానికో దుర్దినం. ఢిల్లీలో బిర్లా నివాసం వద్ద ప్రార్థనా సమావేశానికి వెళ్తుండగా మహాత్మాగాంధీజీని నాథూరామ్ గాడ్సే కాల్చి చంపిన మహా చెడ్డ రోజు ఆ రోజు. గాడ్సే... గాంధీజీని తను ఎలా చంపాడో చెప్పిన మాటలు వింటే.. భారతీయుల గుండెలు తరుక్కుపోతాయి. దేశానికి బ్రిటిష్ దొరల నుంచి విముక్తి కలిగించిన మహానుభావుడిని, దేశానికి స్వేచ్ఛా స్వాతంత్రాల ఊపిరిలూదిన జాతిపితను గాడ్సే తను ఎలా చంపాడో నాడు చెప్పాడు. 
 




"పిస్టల్ నా కుడి అరచేతిలో ఇముడ్చుకొని, రెండు చేతులూ ముకుళించి 'నమస్తే' అన్నాను. నా ఎడమ చేతితో అడ్డంగా ఉన్న ఒక అమ్మాయిని పక్కకు తోసేశాను. ఆ తరువాత తుపాకీ గాంధీజీకి గురిపెట్టాను. తుపాకీ దానంతటే అదే తూటాలను పేల్చిందనిపించింది. నేను రెండు సార్లు కాల్చానా, మూడు సార్లు కాల్చానా అన్నది.. నాకు అంతుచిక్కని విషయం. గాంధీజీ శరీరంలోకి బుల్లెట్ గుచ్చుకోగానే.. 'హే రామ్' అంటూ.. నేలకొరిగారు. 
 
నేను తుపాకీని పైకెత్తి గట్టిగా పట్టుకొని నిలుచుని 'పోలీస్! పోలీస్! అని అరవటం మొదలు పెట్టాను. నాకు కావాల్సిందంతా... నేను ముందుగా వేసుకొన్న పథకం ప్రకారమే నేను గాంధీ హత్యకు పాల్పడ్డానని అందరూ అనుకోవాలి. 
 
అంతేకాని, ఏదో క్షణికావేశంలో చేశానని అనుకోకూడదు. అక్కడ నుంచి తప్పించుకుని పారిపోవటానికి ప్రయత్నిస్తున్నాని గానీ, తుపాకీ వదిలించుకోవాలని అనుకుంటున్నానని గాని ఎవరూ అనుకోకూడదు. తుపాకీతో సహా పట్టుబడటమే నా అభిమతం. కానీ దాదాపు ఒక అర నిమిషం దాకా, ఎవరూ కదలలేదు" అని గాడ్సే వివరించాడు. 
గాంధీజీ చితాభస్మం తీసుకెళ్తున్న రైల్లో ఇందిర
 
"హే రామ్" అంటూ నేలకొరిగిన గాంధీజీ ఆఖరి మాటలు.. ఆయన సమాధి మరియు స్మారక స్థలమైన రాజ్‌ఘాట్‌‌ల వద్ద ఈ మాట మాత్రమే చెక్కబడి ఉంది. భారతదేశానికి సూర్యుడిలా వెలుగు కిరణాలను ఒసగిన గాంధీజీని అస్తమింపజేసిన గాడ్సే, హత్యా స్థలం నుండి పారిపోయే ప్రయత్నం ఏమీ చెయ్యలేదు. అతణ్ణి నిర్భంధించి తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొని వెళ్ళారు. 
 
అక్కడ డీఎస్పీ సర్దార్ జశ్వంత్ సింగ్ ప్రాథమిక సమాచార నివేదిక తయారు చేశాడు. న్యాయ స్థానాలలో విచారణ అనంతరం నాథూరామ్ గాడ్సేను, అతనికి హత్యలో సహకరించిన నారాయణ ఆప్టేలను 1949 నవంబరు 15న ఉరి తీశారు.