శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By tj
Last Updated : బుధవారం, 17 మే 2017 (14:27 IST)

కాంగ్రెస్ నేతలపై ప్రధానికి కక్ష.. ఎందుకు..!

నమో.. ఈ పేరు చెప్పగానే చిన్న పిల్లాడు కూడా వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేరు చెబుతాడు. స్వచ్ఛభారత్ నుంచి ఎన్నో కార్యక్రమాలను తీసుకొచ్చిన మోడీ నవ భారత్ నిర్మాణానికి కట్టుబడి ఉన్నానని ఎప్పటి నుంచో ప

నమో.. ఈ పేరు చెప్పగానే చిన్న పిల్లాడు కూడా వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేరు చెబుతాడు. స్వచ్ఛభారత్ నుంచి ఎన్నో కార్యక్రమాలను తీసుకొచ్చిన మోడీ నవ భారత్ నిర్మాణానికి కట్టుబడి ఉన్నానని ఎప్పటి నుంచో ప్రకటిస్తూనే ఉన్నారు. ఎక్కడ కార్యక్రమం జరిగినా దేశాభివృద్ధికి పాటుపడుతుంటానని చెబుతుంటారాయన. రాజకీయాలంటే విమర్శలు మామూలే. అయితే మోడీకి ఎవరైనా విమర్శ చేస్తే నచ్చదు. అందులోనూ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలంటే అస్సలు పడదు మోడీజీకి. రాహుల్ గాంధీ అంటే అంతెత్తు లేచి పడతారు. రాహుల్ ఎప్పుడు విమర్శలు చేసినా వెంటనే మరో సమావేశంలో మోడీ అందుకు సమాధానమిస్తారు.
 
ఇదంతా రాజకీయాల్లో మామూలే. అయితే ప్రతిపక్షాల విమర్శలు ఈ మధ్య కాలంలో ఎక్కువై పోవడంతో ఇక మోడీకి కోపం కట్టలు తెంచుకుంది. కాంగ్రెస్ పార్టీ అన్నా, ఆ పార్టీ నేతలన్నా ముందు నుంచీ పడని మోడీ వారిపై కక్ష్య తీర్చుకోవాలన్న ఆలోచనలో ఎప్పటి నుంచో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అధికారం వచ్చిన వెంటనే వారిపై కక్ష్య తీర్చుకుంటే బాగుండదని ఓపిక పడ్డారు. అధికారం వచ్చి మూడు సంవత్సరాలు పూర్తవుతోంది. అందుకే ఇప్పుడు ఆ కక్ష్యను తీర్చుకుంటున్నారట. ఎలాగంటారా..
 
అదే కేంద్ర మాజీ మంత్రుల ఇళ్ళపై సీబీఐ, ఐటీ శాఖ దాడులు. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆర్థిక శాఖామంత్రిగా పనిచేసిన చిదంబరం ఇంటిపై సిబిఐ సోదాలు, అంతే కాదు మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ ఇంటిపై ఐటీ దాడులు. ఇలా ఒక్కొక్కరి ఇంటిపైనా సోదాలు, దాడులు జరుగుతున్నాయి. ఇదంతా ప్రధానమంత్రి నరేంద్రమోడే చేయిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 
 
మంగళవారంతో ప్రారంభమైన ఈ సోదాలపర్వం ఇక ప్రతి కాంగ్రెస్ పార్టీ మాజీ నేతల ఇంట్లో చేయించాలన్నదే ప్రధాని ఉద్దేశమట. ఇప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ నేతల గుట్టు రట్టు చేస్తే రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ నేతల్ని ప్రజలు చీదరించుకుంటారన్నదే మోడీ ఉద్దేశం. అందుకే ఒక పక్కా ప్రణాళిక ప్రకారమే మోడీ ఇదంతా చేస్తున్నారనే ప్రచారం లేకపోలేదు.