బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 11 జులై 2023 (10:33 IST)

175 స్థానాల్లో పోటీ చేసే దమ్ము పవన్ కళ్యాణ్‌కు ఉందా?: పోసాని కృష్ణమురళి

posani krishnamurali
ఏపీ సీఎం జగన్‌పై ఆరోపణలు చేయడం మానుకోవాలని ఏపీఎఫ్‌డీసీ చైర్మన్‌ పోసాని కృష్ణమురళి పవన్‌ కల్యాణ్‌ను కోరారు. జగన్ అవినీతికి పాల్పడ్డాడు అనేందుకు పవన్ కళ్యాణ్ ఒక్క రుజువు అయినా చూపించగలరా అంటూ పోసాని కృష్ణ మురళి సవాల్ విసిరారు. 
 
ఇంకా పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఓడించే సత్తా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు ఉంటే, మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎందుకు రాలేకపోయారని నిలదీశారు. ఇంకా ఎందుకు సీఎం కాలేకపోయారని ప్రశ్నల వర్షం కురిపించారు.
 
పవన్ అంత పవర్ ఫుల్‌గా ఉంటే గతంలో పీఆర్పీ పెట్టినప్పుడు చిరంజీవిని ఎందుకు ముఖ్యమంత్రిని చేయలేకపోయాడు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని ఓడించేంత శక్తి జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు లేదని పోసానీ తేల్చి చెప్పారు. 
 
175 స్థానాల్లో పోటీ చేసే దమ్ము పవన్ కళ్యాణ్‌కు ఉందా అని పోసాని కృష్ణ మురళి ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్‌కు నిజంగా దమ్ముంటే 175 స్థానాల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు.
 
పవన్ కళ్యాణ్ కంటే జగన్ చిన్నవాడని, తనకంటే చిన్నవాడు ముఖ్యమంత్రి కుర్చీపై ఉండడాన్ని పవన్ భరించలేకపోతున్నారని పోసాని విమర్శించారు. 
 
అంతేకాదు కాపులను పవన్ కళ్యాణ్ కూడా మోసం చేస్తున్నారని, కాపుల కోసం పదవులను త్యాగం చేసిన ముద్రగడ పద్మనాభంను పవన్ అవమానించడం తగదని సూచించారు.