శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By tj
Last Updated : శుక్రవారం, 16 జూన్ 2017 (11:20 IST)

దీపకు 2, పన్నీరుసెల్వంకు 60... దినకరన్‌కు 20.. ఏంటి..?

తమిళనాడు రాజకీయాల్లో మరో కొత్త మలుపు. అసెంబ్లీలో బలాబలాను తేల్చుకుని ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలో ఇక తేలిపోనుంది. అయితే అన్నాడీఎంకేలో మాత్రం ఇప్పటికే దీప, పన్నీరుసెల్వం, పళనిస్వామి, టీటీవీ. దినకరన్ (శశికళ

తమిళనాడు రాజకీయాల్లో మరో కొత్త మలుపు. అసెంబ్లీలో బలాబలాను తేల్చుకుని ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలో ఇక తేలిపోనుంది. అయితే అన్నాడీఎంకేలో మాత్రం ఇప్పటికే దీప, పన్నీరుసెల్వం, పళనిస్వామి, టీటీవీ. దినకరన్ (శశికళ) వర్గాలు ఎవరికి వారున్నారు. ముఖ్యమంత్రిగా పళనిస్వామి ఉన్నా మిగిలిన వారి కారణంగా పళనిస్వామి పదవికి పెద్ద చిక్కే వచ్చిపడింది. దినకరన్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక ఎమ్మెల్యేల కొనుగోలు ప్రారంభమైంది. అసెంబ్లీలో విశ్వాస పరీక్షలు పెడితే తమకు మద్దతు ఇవ్వాలని పన్నీరుసెల్వం, దినకరన్‌లు ఓటుకు కోట్లు కుమ్మరించడానికి సిద్దమయ్యారు. ఈ విషయం కాస్త గత రెండురోజుల అసెంబ్లీలో తీవ్ర దుమారమే రేపుతోంది.
 
ఇలాంటి తరుణంలో ఒక తమిళ మీడియా సర్వే నిర్వహించింది. అన్నాడీఎంకేలో పళనిస్వామిని పక్కనబెడితే పళనిస్వామికి మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలు దీప, పన్నీరుసెల్వం, దినకరన్‌లకు ఏ మాత్రం సహకరిస్తారో సర్వే నిర్వహించారు. అందులో దీపకు కేవలం 2 శాతం, పన్నీరుసెల్వంకు 60 శాతం, దినకరన్‌కు 20 శాతం మంది ఎమ్మెల్యేలు సహకరిస్తారని సర్వేలో తేలింది. 
 
పళనిస్వామి కన్నా పన్నీరుసెల్వమే బెట్టరన్నది అన్నాడిఎంకే ఎమ్మెల్యేల ఆలోచన. ఇప్పటికే డిఎంకే పట్టుబట్టి మరీ అసెంబ్లీలో విశ్వాస పరీక్షల కోసం పట్టుబడుతోంది. అదే జరిగితే పన్నీరుసెల్వం ఖాయమన్నది ఆ సర్వే ఫలితాల్లో స్పష్టంగా కనబడుతోంది. ఈ సర్వేపై ఇప్పటికే పన్నీరుసెల్వం వర్గీయులు సంబరాలు చేసుకుంటున్నారు. విశ్వాస పరీక్షలు అసెంబ్లీలో ఎప్పుడు ప్రవేశపెడతారా అని ఎదురుచూస్తున్నారు.