1. ఇతరాలు
  2. వంటకాలు
  3. ఫాస్ట్ ఫుడ్
  4. How to Make Oats Pakoda Recipe

ఓట్స్‌తో వేడి వేడి పకోడీలు తయారు చేయాలంటే?

Oats Pakoda Recipe
Oats Pakoda
ఓట్స్ తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి బి విటమిన్లు, ఐరన్, మాంగనీస్, అయస్కాంత, భాస్వరం, జింక్, రాగి మరియు సెలీనియం వంటి అనేక విటమిన్లు మరియు ఖనిజాలతో నిండింది. ఓట్స్‌ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాంటి వోట్స్‌తో పకోడీలు చేస్తే టేస్ట్ అదిరిపోతుంది. 
 
కావలసిన పదార్థాలు 
ఓట్స్ : ఒక కప్పు
ఉల్లిగడ్డ : 1
పెరుగు : 2 టేబుల్‌స్పూన్స్,
బియ్యం పిండి : ఒక టేబుల్‌స్పూన్
శనగపిండి : 1 1/2 టీస్పూన్స్
పచ్చిమిర్చి : 2
కరివేపాకు : 2 రెమ్మలు
కొత్తిమీర : చిన్న కట్ట
నూనె, ఉప్పు : తగినంత
 
ఓట్స్ పకోడి తయారీ
ముందుగా ఒక గిన్నెలో ఓట్స్, బియ్యం పిండి, శనగపిండి, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేయాలి. ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేయాలి. కొద్దిగా నూనెని వేడి చేసి ఇందులో పోయాలి. అందులో పెరుగు, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. కడాయిలో నూనె వేసి బాగా వేడి చేయాలి. ఈ నూనె కాగిన తర్వాత ఓట్స్ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేసి పకోడీల్లా బాగా వేయించాలి. సాస్‌తో సర్వ్ చేస్తే టేస్టు అదిరిపోతుంది. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
శెనగలు ఉడికించిన నీటితో వేడి వేడి రసం తయారు చేస్తే?