దత్తం దత్తం పునర్దత్తం యోవదేత్ భక్తి సంయుతః
మార్గశిర పౌర్ణమి రోజున దత్త జయంతిగా జరుపుకుంటారు. ఇది పవిత్రమైన రోజుగా పరిగణించబడుతోంది. అత్రి మహాముని, మహా పతివ్రత అనసూయల సంతానం దత్తాత్రేయడు. బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుల అంశలతో జన్మించిన అవతారమూర్తి ఆయన. దత్తాత్రేయుడు విష్ణువు అంశతో, చంద్రుడు బ్రహ్మ అంశతో, దుర్వాసుడు శివుని అంశతో జన్మించారని పురాణ కథనం. గురుతత్వానికి మొదటివాడు అవడం వల్ల ఈయనకు ఆది గురువనే పేరు ఉన్నది.
ఆయన ఎందరో మహా పురాణపురుషులకు, దేవతలకు జ్ఞానబోధ, సహాయము చేసిన ఉదాహరణలు వివిధ పురాణాలలో ప్రస్తావించబడ్డాయి. దత్తాత్రేయుని భక్తితో స్మరించినవారికి సమస్త పాపములు నశిస్తాయి. దత్తాత్రేయుడు కేవలం స్మరణ మాత్ర్ర సంతుష్టుడు. తీవ్రమైన పూజాదికాలు చేయకపోయినా “అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ” అనే పవిత్ర భావనతో, భక్తితో దత్త, దత్త అని స్మరిస్తే చాలు, ఏదో ఒక రూపంలో వచ్చి, రక్షించి కోరిన కోరికలు తీర్చుతాడని నమ్మకం.
పఠించాల్సిన శ్లోకం....
దత్తం దత్తం పునర్దత్తం యోవదేత్ భక్తి సంయుతః
తస్య పాపాని సర్వాణి క్షయం యాంతి న సంశయః