Daily Horoscope
✕

సోదరునికి సోదరి రాఖీ ఎప్పుడు కట్టాలి..?

Updated: బుధవారం, 14 ఆగస్టు 2019 (19:06 IST)
శ్రావణ పౌర్ణమి నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలంటుస్నానం చేయాలి. ఆ తర్వాత రక్షారేకును పూజించాలి. అనంతరం సోదరి తన అన్నదమ్ములకు నుదుట తిలకం పెట్టాలి. శ్రావణ పౌర్ణమి రోజున మధ్యాహ్న సమయంలో వారికి రాఖీ కట్టాలని పండితులు చెప్తున్నారు. ఆ తర్వాత నోరు తీపి చేయడం సంప్రదాయం.
 
మనం చేసే ప్రతి పనికి కర్మసాక్షి ఆ సూర్యనారాయణుడు, మధ్యాహ్నం వేళ సూర్యకిరణాల తాకిడి ఎక్కువగా ఉంటాయి. అంతటి తేజస్సు రాఖీలో ఇమిడి ఉంటుందని, ఆ సమయంలోనే రాఖీని కట్టించుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక పెళ్లి అయిన ఆడపడుచులు తమ పుట్టింటికి వెళ్లి సోదరులకు రాఖీలను కట్టడం సంప్రదాయం. 
 
పూర్వకాలంలో భర్తకి భార్య రక్షణ కోసం రాఖీని కట్టేది. దేవదానవ యుద్ధంలో ఇంద్రుడికి విజయం కలగాలని శచీదేవి రక్ష కడుతుంది. పురాణ కాలంలో రాజులు యుద్ధాలకువెళ్లే ముందు, ఏదైనా కార్యం తలపెట్టే ముందు రక్షను కట్టుకొని ఆ తర్వాత కార్యాలను మొదలుపెట్టి గెలుపొందేవారు. రాఖీ పౌర్ణమీ రోజు కట్టే రక్షలో ఆసామాన్యమైన విష్ణుశక్తి ఉంటుందన్నది ప్రజల ప్రగాఢ విశ్వాసం.

అన్నీ చూడండి

అక్టోబర్ 22, 2026 నాడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాతావరణం ఎలా వుందంటే?

మార్కో రూబియో, సెర్గియో గోర్‌లకు జామ్ నగర్‌కు స్వాగతం పలికిన ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీ

జంబూ సవారీలో అపశృతి, అమ్మవారి అంబారీని కిందపడేసిన ఏనుగు, వీడియో

ఆప్ఘనిస్థాన్ వ్యక్తి.. ఆయనకు నలుగురు భార్యలు.. 58 మంది పిల్లలు.. పోషించలేక ఇబ్బందులు.. (video)

పంజరంలో పెట్టిన పాలపిట్ట రోదనలో శుభం ఎలా కనిపిస్తుంది?: సజ్జనార్ ప్రశ్న

అన్నీ చూడండి

శిశువు మెడలో పేగు వేసుకుని జన్మిస్తే...?

నల్లపిల్లి, కన్ను అదరడం, సాయంత్రం ఇల్లు చిమ్మడం మంచిదేనా?

21-10-2026 బుధవారం దిన ఫలాలు - బాకీలను చాకచక్యంగా వసూలు చేసుకోవాలి...

20-10-2026 మంగళవారం రాశి ఫలాలు - ఆర్థిక విషయాల్లో ఇతరుల మాటల్ని నమ్మొద్దు

19-10-2026 సోమవారం ఫలితాలు - ఆశించిన ఆశించిన పదవి దక్కకపోవచ్చు...

తర్వాతి కథనం
Show comments